Ram charna: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సోమవారం కడప దర్గాని సందర్శించారు. ఈ సందర్భంగా 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటకోసమే తాను కడప దర్గాకి వచ్చానని తెలిపాడు.
నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే తనని చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. తనతండ్రి చిరంజీవి కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారని చెప్పుకొచ్చాడు. ఇక బుచ్చిబాబు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన డీటెయిల్స్ తెలియజేస్తామని అన్నాడు.
ALSO READ : Unstoppable Show: నా కొడుకు యానిమాల్ సినిమాలో రణబీర్ కపూర్‌లాంటోడే: అల్లు అర్జున్
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతోంది.