Ram Charan: డెడికేషన్ అంటే ఇది: 103 డిగ్రీల జ్వరంతో షూటింగ్ కి వెళ్లిన రామ్ చరణ్..

Ram Charan: డెడికేషన్ అంటే ఇది: 103 డిగ్రీల జ్వరంతో షూటింగ్ కి వెళ్లిన రామ్ చరణ్..

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC16 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దేవర మూవీ ఫేమ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మైసూరులో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అయితే మొన్నటివరకూ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు RC16 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

ఈ షెడ్యూల్ ని తొందరగా కంప్లీట్ చేసెందుకు చిత్ర యూనిట్ డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ దాదాపుగా 103 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కి హాజరవుతున్నాడట. ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ రామ్ చరణ్ మాత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకూ నో రెస్ట్ అంటూ చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చెర్రీ డెడికేషన్ కి టేక్ ఏ బౌ అంటున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో శంకర్ దర్శకత్వం వహించిన "గేమ్ ఛేంజర్" తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రామ్ చరణ్ RC16 తో ఫ్యాన్స్ కి ఫుల్ ప్యాక్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక RC16 సినిమా క్యాస్ట్ క్రూ విషయానికొస్తే ఈ సినిమాలో జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్  దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, వెటరన్ హీరోయిన్ రమ్యకృష్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.