Ram Charan Birthday: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్..

Ram Charan Birthday: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడులకుని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇందులోభాగంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రామ్ చరణ్ బర్త్ డేని హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఈ సెలెబ్రేషన్స్ కి ఉపాసన కి అత్యంత సన్నిహితులైన దాదాపుగా 40 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. 

ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, ప్రముఖ నటి, హోస్ట్ మంచు లక్ష్మి, బిజినెస్ ఎంటర్ప్రినర్ శిల్పా రెడ్డి తదితరులతోపాటూ మరింతమంది వచ్చి రామ్ చరణ్ కి విష్ చేశారు. నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో రామ్ చరణ్ తో దిగిన ఫోటోలని షేర్ చేసి విషెష్ తెలిపింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ తో, ఫుల్ షేవింగ్ లుక్ లో కనిపించాడు. ఈ బర్త్ డే ఫోటోలు బయటికి రావడంతో నెటిజన్లు, అభిమానులు రామ్ చరణ్ కి పెద్ద ఎత్తున విషెష్ తెలిపారు. 

Also Read :- వీర ధీర శూరన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న 'పెద్ది' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని చెర్రీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.