RC15 సెట్‌లో రామ్ చరణ్ సర్‌‌ప్రైజ్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వరల్డ్‌ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆస్కార్ హడావుడి పూర్తవగానే ఇటీవల తన 15వ మూవీ సెట్స్‌ లో జాయిన్ అయిన చరణ్‌కి టీమ్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చరణ్, కియారా అద్వానీలపై దర్శకుడు శంకర్ సాంగ్ షూట్ చేశారు. శనివారం రాత్రితో ఈ పాట షూట్ పూర్తయింది. సోమవారం చరణ్ బర్త్‌ డే సందర్భంగా ఒకరోజు ముందే సెట్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించి సర్‌‌ప్రైజ్ చేశారు మేకర్స్.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి. దర్శకుడు శంకర్‌‌తో పాటు ప్రభుదేవా, రామ్ చరణ్, కియరా అద్వానీ, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఆర్సీ 15’ వర్కింగ్ టైటిల్‌తో తెరెకెక్కుతోన్న ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జే.సూర్య, జయరామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ ఏడాది చివర్లో పాన్ ఇండియా వైడ్‌గా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.