
మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిల్మ్స్ లో రామ్ చరణ్ RC16 ఒకటి. నేడు మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మూవీకి 'పెద్ది' (PEDDI) అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను తెలియజేస్తున్నాయి. అందులో ఒక పోస్టర్లో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు. మరో పోస్టర్‌లో జాతర సెట్, విలేజ్ నేటివిటీ, చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్‌లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ మెగా అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇకపోతే, ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ముసలివారిని,పెద్దవారిని 'మా పెద్ది' అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. పెద్ది అనే టైటిల్..బుచ్చిబాబు కథకి తగ్గట్టుగా సెట్ చేసినట్లు వినిపిస్తోంది.
? ??? ?? ??? ????, ? ????? ?? ??? ?????? ❤️?#RC16 is #PEDDI ??
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025
Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3
స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kappoor) హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మిర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ దివ్యేందు తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.