కామెడీ జోనర్ లో రామ్ చరణ్ కొత్త మూవీ

కామెడీ జోనర్ లో రామ్ చరణ్  కొత్త మూవీ

కామెడీ జానర్‌‌‌‌లో.. 

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం డిసెంబర్‌‌‌‌లో విడుదల కానుంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరోవైపు త్వరలోనే కొత్త చిత్రం షూట్‌‌లో జాయిన్‌‌ అవబోతున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పాన్‌‌ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటించనుంది.  ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.  ఈ సినిమా ఏ జానర్‌‌‌‌లో ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది.  

అయితే ఇదొక కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ అని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.  ఇటీవల  ఓ బైక్ లాంచ్‌‌ ఈవెంట్‌‌లో పాల్గొన్న రామ్ చరణ్.. ర్యాఫిడ్ ఫైర్‌‌‌‌ రౌండ్‌‌లో పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. థ్రిల్లర్, కామెడీలలో ఏ జానర్‌‌‌‌ ఇష్టం అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటివరకూ తాను కామెడీ సినిమాలు చేయలేదని, తన నెక్స్ట్‌‌ మూవీలో మాత్రం కామెడీ ఉండబోతోందని స్పష్టం చేశాడు. ‘నాయక్’ లాంటి చిత్రాల్లో కొంత కామెడీ ఉన్నప్పటికీ ఫుల్‌‌ లెంగ్త్‌‌ కామెడీ సినిమాలో మాత్రం చరణ్ ఇంతవరకూ నటించలేదు. మరి ఈ సారి ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి. ఇక తన ఫేవరేట్‌‌ హీరో సూర్య,  హీరోయిన్ సమంత అని, తన చిత్రాల్లో ఆరెంజ్,  రంగస్థలం ఇష్టమైన చిత్రాలని, ‘మగధీర’ ల్యాండ్ మార్క్ మూవీ అని రామ్ చరణ్ చెప్పాడు.