‘ఉప్పెన’ తరహాలో ఎవరూ ఊహించని విధంగా బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్

‘ఉప్పెన’ తరహాలో ఎవరూ ఊహించని విధంగా బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్

ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్‌‌‌‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం తన 16వ సినిమాతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌‌లో మొదలైంది. ఈ సెట్స్‌‌కు తన కూతురు క్లీంకారను తీసుకొచ్చాడు చరణ్. కూతురుని ఎత్తుకుని ఉన్న  ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన ‘మై లిటిల్ గెస్ట్ ఆన్ ఆర్సీ 16’ అని పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ గురించి టాలీవుడ్‌‌లో పెద్ద చర్చ జరుగుతోంది.

బుచ్చిబాబు రూపొందించిన ‘ఉప్పెన’ తరహాలో ఎవరూ ఊహించని విధంగా ఇందులోని క్లైమాక్స్ ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ‘రంగస్థలం’లోని క్లైమాక్స్ కూడా అందర్నీ మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మాదిరిగానే ఇందులోనూ డిఫరెంట్ క్లైమాక్స్‌‌ను డిజైన్ చేశాడట బుచ్చిబాబు. ఇది చిత్రానికి ఎంతో కీలకం అని,  చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్,  మైత్రి  మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.