
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar)తో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్న ఆయన..అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi Babu Sana)తో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే లాంఛనంగా మొదలుకానుంది. అయితే..పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ని ఎంచుకున్నారట బుచ్చిబాబు.
స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు పెద్ది(Peddi) అనే టైటిల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ముసలివారిని,పెద్దవారిని 'మా పెద్ది' అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. పెద్ది అనే టైటిల్..బుచ్చిబాబు కథకి తగ్గట్టుగా సెట్ చేసినట్లు వినిపిస్తోంది.
2022లో ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమాకు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే టైటిల్ ను రామ్ చరణ్ చిత్రానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కావడంతో..అదే రోజున టైటిల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ..షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది.అయితే, పెద్ది టైటిల్ ఫ్యాన్స్ కు కూడా నప్పేలా ఉందని కామెంట్స్ విపిస్తున్నాయి.
ఇక RC16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా..రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
#RC16 is coming to Uttarandhra for a talent hunt ❤️?
— BuchiBabuSana (@BuchiBabuSana) February 1, 2024
To all the aspiring actors, get ready to be a part of something sensational ?#RamCharanRevolts
Mega Power Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/JhnbCwjCkn