Ram Charan: కొత్త కారు కొన్న చరణ్..ఇండియాలోనే రెండోది..ధరెంతో తెలుసా?

మెగా వారసుడిగా,నటుడిగా రామ్ చరణ్(Ram Charan)కు ఉన్న క్రేజీ వేరు.RRR సినిమాతో అంతర్జీతీయ గుర్తింపు పొందిన నటులలో ఒక్కడిగా మారాడు. ప్రస్తుతం చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ తెగ ట్రెండింగ్ లోకి వస్తుంది.ఇటీవలే రామ్ చరణ్ ఆటో మొబైల్ గ్యారేజ్ లోకి ఓ అద్భుత ఫీచర్స్ కలిగిన కొత్త కారు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తన షెడ్ లో చాలా రకాలైన కార్లు ఉన్నపటికీ..మరో లెగ్జరీ కారు కొనుగోలు చేశాడు.అది కూడా అల్లాటప్పా కారు కాదండోయ్..దాని రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Also Read:-మోక్షజ్ఞ సినిమాకు పాన్ ఇండియా డైరెక్టర్!..బాలయ్య కూతురు కూడా సినిమాల్లోకి!!

రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా రూ.7.5కోట్ల విలువైన బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్టర్.ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువే.ఈ రోల్స్ రాయిస్ కారుని చరణ్ స్వయంగా  డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి రాగా..ఉపాసన కూడా ఈ కారులో క్లిన్ కారాతో కలిసి వచ్చింది. 

రోల్స్ రాయిస్ స్పెక్ట్రాగా పిలువబడే ఈ కారు ఇండియాలో రెండో కారు అని తెలుస్తోంది. ఈ కారు ఈ ఏడాది జనవరిలోనే ఇండియాలో ప్రారంభించబడగా..అప్పుడు వెంటనే చరణ్ బుక్ చేయించగా అది ఈ మధ్యనే డెలివరీ అయింది..నిన్న గురువారం ఉదయం  రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన..ఈ కారులో రాగా ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read:వివాదాస్పద ట్రైనీ ఐఎఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

ఈ మెగా దంపతులిద్దరూ ఇవాళ  జూలై 12న ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వివాహానికి అటెండ్ అవుతున్నారు. రామ్ చరణ్ కేవలం సినిమాల్లోనే నటించడమే కాకుండా లగ్జరీ కార్ల పట్ల తనకున్న అభిమానంతో కూడా  ఎంతో పేరు తెచ్చుకున్నాడు. 

రామ్ చరణ్ కార్ కలెక్షన్స్ :

మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 —రూ. 4 కోట్లు
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ — రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" లో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. ఇంకో 20% షూటింగ్ మిగిలి ఉంది. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.