ఓయ్ డార్లింగూఉ: ప్రభాస్కు కాల్ చేసిన రామ్ చరణ్.. అందుకు డార్లింగ్కి సమయం వచ్చేసింది!

ఓయ్ డార్లింగూఉ: ప్రభాస్కు కాల్ చేసిన రామ్ చరణ్.. అందుకు డార్లింగ్కి  సమయం వచ్చేసింది!

బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable S4) ఎపిసోడ్ దుమ్ములేపుతోంది. ఈ సంక్రాంతి పండుగకు బ్లాస్ట్ ఇచ్చేలా.. కొత్త సినిమాల ప్రమోషన్స్తో షో అద్దిరిపోతుంది. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు మెగా హీరో రామ్ చరణ్(Ram Charan). ఇందులో భాగంగా చరణ్, బాలయ్య మధ్య ఆసక్తికర ముచ్చట్లు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఇందులో రామ్ చరణ్ తన మిత్రుడు రెబల్ స్టార్ ప్రభాస్కు (Prabhas) ఫోన్ చేశారట. ఇందులో వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఇదే షోకి హీరో ప్రభాస్ వచ్చినప్పుడు చరణ్ కి రెబల్ స్టార్ కాల్ చేశాడు. ఇప్పుడు చరణ్ హీరో ప్రభాస్కు కాల్ చేశాడట. అయితే, అప్పుడు ప్రభాస్ కి  గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబుతూ చరణ్ సరదాగా ఆటపట్టించాడు. దీంతో నువ్వు కూడా ఏదో రోజు అన్ స్టాపబుల్ షోకు వస్తావుగా.. ఎలాగైనా నువ్వు నాకే చేయాలి. అప్పుడు చెబుతా అంటూ ప్రభాస్ ఫన్నీగా అన్నాడు.

ఇక అందుకు ప్రభాస్ సమయం వచ్చేసింది. (అప్పుడు ప్రభాస్ : ఒరేయ్ చరణూఉ) (ఇప్పుడు చరణ్ : ఓయ్ డార్లింగూఉ..) అంటూ సరదా ముచ్చట జరిగిందట. దీంతో వీరిద్దరి మాటలు ఎలా సాగాయో అని ఇరువురి ఫ్యాన్స్ క్రేజీగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ జనవరి 10న, సాయంత్రం 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఇవాళ శుక్రవారం జనవరి 3న డాకు మహారాజ్ చిత్ర యూనిట్ కి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్కి సంబంధించి ఇవాళ సాయంత్రం 7 గంటలకి అప్డేట్ రానుంది.