గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "గేమ్ ఛేంజర్". ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటిస్తుండగా ఎస్.జె సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. 

అయితే గేమ్ ఛేంజర్ సినిమాకోసం రామ్ చరణ్ దాదాపుగా రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రెమ్యూనరేషన్ సినిమాలోని బడ్జెట్ లో దాదాపుగా 22% శాతం ఉంది. ఇక కియార అద్వాని కూడా రూ.5 నుంచి రూ.7 కోట్లు తీసుకుంటునట్లు తెలుస్తోంది. దీంతో ఇతర నటీనటుల రెమ్యూనరేషన్, మేకింగ్ బడ్జెట్ ఇవన్నీ కలిపితే  గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు పైగా ఉంటుందని అంచనా.. అయితే ఈ సినిమాలోని పాటలకే దాదాపుగా రూ.95 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ బాగా పెరిగింది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి బడ్జెట్ ని బట్టి దాదాపుగా రూ.100 నుంచి 150 కోట్లు తీసుకుంటన్నాడు.  

Also Read : ఉపేంద్ర యూఐ కి హిట్ టాక్.. కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయాయా..?

టాలీవుడ్ లో ఇప్పటివరకూ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో పుష్ప 2 మూవీ ఫేమ్ అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడు. కాగా పుష్ప 2 కోసం అల్లు అర్జున్ దాదాపుగా రూ.350 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానుంది. దీంతో జనవరి 10న ప్యాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో రిలీజ్ రోజే దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.