స్పీడందుకున్న ఆర్‌‌‌‌సీ 16

బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. శంకర్ రూపొందిస్తున్న  ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రీసెంట్‌‌గా తన పోర్షన్ షూట్‌‌ను పూర్తి చేసిన చరణ్.. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాపై ఫోకస్  పెడుతున్నాడు. ‘ఆర్‌‌‌‌సీ 16’ వర్కింగ్ టైటిల్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. రీసెంట్‌‌గా దుబాయ్‌‌లో మ్యూజిక్ సిట్టింగ్స్‌‌ను స్టార్ట్ చేశాడు బుచ్చిబాబు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌‌తో దుబాయ్‌‌లోని ఫిర్‌‌‌‌దౌస్ స్టూడియోలో పాటల పనులు జరుగుతున్నాయని సోషల్ మీడియా ద్వారా అప్‌‌డేట్ ఇచ్చాడు.

ALSO READ : జైలర్ దర్శకుడితో.. పుష్ప రాజ్

ఈ సందర్భంగా రెహమాన్‌‌తో పాటు  సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసున్న ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు సెట్స్‌‌ వర్క్ త్వరలోనే పూర్తి చేసే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటించనున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌పై  వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందనున్న ఈ  చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.