RC16: రామ్ చరణ్‌ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార.. ఫోటో వైరల్

RC16: రామ్ చరణ్‌ RC16 షూటింగ్ స్పాట్‌కు మెగా ప్రిన్సెస్ క్లీంకార.. ఫోటో వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RC 16'(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో RC 16 చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారతో షూటింగ్ ప్రాంతంలో ఉన్న ఫోటో షేర్ చేశాడు. "RC16 సెట్‌లో ప్రత్యేక అతిథి!" అంటూ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారింది.

ఈ ఫొటోలో షూటింగ్ ప్రదేశం వైపు క్లీంకార చూస్తూ చేయి చాచి ఏదో చూపిస్తుంది. అదే మాదిరిగా రామ్ చరణ్ క్లీంకార వైపు చూస్తుండిపోయాడు. అయితే, ఇందులో చరణ్ కుమార్తె క్లీంకార ముఖం కనిపించకుండా చూసుకున్నారు.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే, కాస్తా రెస్ట్ తీసుకుని రామ్ చరణ్ RC 16 లేటెస్ట్  షెడ్యూల్ లో పాల్గొనడానికి సిద్దమయ్యాడు. కమిట్ ఐన సినిమా కోసం తన వల్ల ఆలస్యం అవ్వకూడదని అనారోగ్యంతో ఉన్న కూడా రామ్ చరణ్ సెట్కి వచ్చాడంటూ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

ఈ లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే బ్రేక్స్ లేకుండా వరుస షెడ్యూల్స్‌‌తో జులై వరకు షూటింగ్ పూర్తి చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నాడట. వీలైతే  దసరాకు లేదంటే డిసెంబర్‌‌‌‌లో RC 16 విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

పీరియాడికల్‌‌ స్పోర్ట్స్‌‌ బ్యాక్‌‌ డ్రాప్‌‌ వస్తోన్న ఈ సినిమాలో రామ్‌‌ చరణ్‌‌ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.‘పెద్ది’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది. మార్చిలో చరణ్‌‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌‌, గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.