తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathi Vijay) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లియో(Leo). సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ మాస్ అండ్ గ్యాంగ్ స్టర్ ఎంటర్టైనర్ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్టర్(Mastar), విక్రమ్(Vikram) లాంటి సూపర్ హిట్ తరువాత లోకేష్ నుండి వస్తున్న మూవీ కావడంతో లియో పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే లియో నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా లియో సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఒక క్యామియో రోల్ చేస్తున్నారట. ఈ వార్త గత వరం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
Also Read :- టైగర్ నాగేశ్వర రావు చిత్ర నిర్మాత కార్యాలయంపై ఐటీ దాడులు
.@AlwaysRamCharan ft #Leo ??@Dir_Lokesh @7screenstudio @MrRathna @anirudhofficial #GameChanger pic.twitter.com/y4D5YIuTUP
— #LEO OFFICIAL (@TeamLeoOffcl) October 10, 2023
అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. లియో అఫీషియల్ ట్విట్టర్ లో లియోలో ఎవరి క్యామియో ఉందని మీరు అనుకుంటున్నారు అది పోల్ నిర్వహించారు. అందులో కమల్ హాసన్, రామ్ చరణ్, ధనుష్, ఫహద్ ఫాజిల్ పేర్లను మెన్షన్ చేశారు. ఈ పోల్ లో రామ్ చరణ్ మొదటి స్థానంలో నిలిచారు. దీంతో రామ్ చరణ్ ఎఫ్టీ ఇన్ లియో అంటూ పోస్ట్ చేశారు. దీంతో లియో సినిమాలో రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ వార్త చూసిన విజయ్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా భారీ వసూళ్లు చేయడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.