శంకర్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ చెప్పు ..లేదంటే చస్తా : అభిమాని సూసైడ్ నోట్

రామ్ చరణ్(Ram Charan)  హీరోగా శంకర్( Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. కియారా అద్వాని హీరోయిన్‌‌‌‌‌‌‌‌(Kiara Advani)గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు స్టోరీని అందించాడు. శంకర్ ఓవైపు కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌తో భారతీయుడు2 తీస్తూనే మరోవైపు  గేమ్ ఛేంజర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేస్తున్నారు శంకర్. రీసెంట్గా ఈ మూవీ ఎలక్ట్రిఫయింగ్ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేశాం..అంటూ శంకర్ అప్డేట్ ఇచ్చారు.

లేటెస్ట్గా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ లేట్ విషయంలో రామ్ చరణ్ వీరాభిమాని తనదైన పంథాలో సూసైడ్ నోట్ రాశాడు. దీంతో ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'రామ్ చరణ్ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా ఓపికగా ఎదురుచూస్తున్నాను. కానీ ఎటువంటి అప్డేట్స్ ను..మేకర్స్  ప్రకటించట్లేదు. నేను ప్రొడక్షన్ టీం వారికి మూడు రోజులు సమయం ఇస్తున్నాను..రిలీజ్ డేట్ని వెంటనే ప్రకటించాలి. లేదంటే సూసైడ్ చేసుకొని చస్తాను..నా చావుకు కారణం డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ SVC ప్రొడక్షన్ హౌస్‌లే కారణం.

లవ్ యు చరణ్ అన్న, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా వచ్చే జన్మలో కూడా..నేను మీకు మంచి అభిమానిని అవుతానని ఆశిస్తున్నాను, ఇట్లు బాబు గౌడ్' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇపుడు ఈ నోట్ సినీ ఇండస్ట్రీలో హాట్ ఇష్యూగా మారిపోయింది.

ఈ సూసైడ్ నోట్ చూసిన నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సినిమా అప్డేట్ కోసం ఏకంగా సూసైడ్ చేసుకోవడం ఏంటి? హీరోలు అంటే అభిమానం ఉండాలి. అంతేకానీ, ఇలా చస్తానంటూ బెదిరించడం ఏంటీ? మరికొందరు అయితే..పిచ్చి పీక్స్లా మారిందంటూ..కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీరాభిమాని లేఖతో అయినా గేమ్ ఛేంజర్ నుంచి ఏమైనా అప్డేట్లు వస్తాయో లేదో చూడాలి.

రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో జ‌‌‌‌‌‌‌‌యరామ్‌‌‌‌‌‌‌‌, అంజ‌‌‌‌‌‌‌‌లి, సునీల్, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, న‌‌‌‌‌‌‌‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.