ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చరణ్ ఫ్యాన్స్ సపోర్ట్.. అందరం కలిసి చెల్లి పెళ్లి చేద్దాం

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చరణ్ ఫ్యాన్స్ సపోర్ట్.. అందరం కలిసి చెల్లి పెళ్లి చేద్దాం

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో శ్యామ్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికందొచ్జిన కొడుకు ఇలా అర్దాంతరంగా చనిపోవడంతో.. శ్యామ్ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా శ్యామ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. శ్యామ్ మరణ వార్త..తన మనసును కలచివేసిందన్నారు. 

శ్యామ్ మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న అతని తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా మారింది "రా ఎన్టీఆర్" స్వచ్ఛంద సంస్థ.  శ్యామ్ చెల్లెలి పెళ్లి భాద్యత తమదే అని ప్రకటించింది. చనిపోయిన శ్యామ్ ను ఎలాగూ తీసుకురాలేము కానీ.. ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటాం. అందుకే శ్యామ్ చెల్లి పెళ్లి బాధ్యత మాది అంటూ ప్రకటించారు రా ఎన్టీఆర్ స్వచ్ఛంద సంస్థ. 

ALSO READ:ఎందుకంత హడావిడి...  మహారాష్ట్రలో తెలంగాణ సర్కారు!

ఇక తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు. శ్యామ్ మరణంపై స్పందించిన రామ్ చరణ్ ఫ్యాన్స్.. శ్యామ్ చెల్లి పెళ్లికి తాము కూడా సపోర్ట్ చేస్తాం అని ప్రకటించారు. "పెళ్లి వివరాలు మాకు కూడా చెప్పాడన్నా.. మేము మీతోపాటు మా వంతూ సహాయమా చేస్తాం. అందరం కలిసి చెల్లి పెళ్లి చేద్దాం అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. టాలీవుడ్ హీరోలందరూ, వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పడూ ఇలాగే కలిసి ఉండాలి. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఆపేసి ఇలాంటి మంచి పనులు చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.