గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేటర్స్ లో దూసుకెళ్తోంది. జనవరి 10న రిలీజైన ఈ మూవీకి మెగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సోలోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు మేకర్స్ కూడా వెల్లడించారు. అయితే, సెకండ్ డే మాత్రం గేమ్ ఛేంజర్ జోరు తగ్గింది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..
వెబ్‌సైట్ Sacnilk ప్రకారం:
గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10 శుక్రవారం రిలీజై.. మొదటి మూడు రోజుల్లో 89.6 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే రూ.51 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 2వ రోజు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దాంతో రెండో రోజైన శనివారం రూ.21.6 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
మూడవ రోజైన ఆదివారం (జనవరి 12) న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.17 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 89.6 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే మూడో రోజు మాత్రం 65 శాతం కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ జనవరి 13న భోగి మొదలవ్వడంతో రానున్న రెండ్రోజులు కూడా పండుగ వాతావరణం క్రియేట్ అవుతుంది. దాంతో గేమ్ ఛేంజర్ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
ఇకపోతే.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే రూ.186 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, అప్పటి నుండి మళ్ళీ గ్రాస్ వసూళ్ల అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే ఆదివారంతో వీకెండ్ ముగిసేసరికి దాదాపు రూ.250-300 కోట్ల గ్రాస్ మార్కు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే..గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లను మూవీ టీమ్ పెంచి చూపించిందనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.