Game Changer: గేమ్ ఛేంజర్ కోసం ఇండియాలోనే అతిపెద్ద కటౌట్.. ఎక్కడో తెలుసా..?

Game Changer: గేమ్ ఛేంజర్ కోసం ఇండియాలోనే అతిపెద్ద కటౌట్.. ఎక్కడో తెలుసా..?

Game Changer: 2022 లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ (Ram Charan)  గేమ్ ఛంజర్ మూవీతో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సోలో హీరోగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై  దిల్ రాజు నిర్మించారు. దీంతో మెగా అభిమానులు.. ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై చరణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.. అలాగే కచ్చితంగా మంచి హిట్ కొడతారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, యూట్యూబ్ ని షేక్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రమోషన్స్ లో భాగంగా మెగా అభిమానుల సమక్షంలో ఇండియాలో అతి పెద్ద కటౌట్ ను విజయవాడలో ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో దావన్ కాలనీలోని వజ్రా గ్రౌండ్స్‌ లో 250 అడుగుల భారీ రామ్ చరణ్ కటౌట్  ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 29న సాయంత్రం 4 గంటలకు గ్రాండ్ గా కటౌట్ రివీల్ ఈవెంట్ జరగనున్నట్లు ప్రకటించారు.

ALSO READ : UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..

ఇక మేకర్స్.. నేడు అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అందుకుగాను ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ సహా పలువురు అమెరికా చేరుకున్నారు.ఇక సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా, ముఖ్యపాత్రలో అంజలి, ఎస్.జె సూర్య, శ్రీకాంత్ నటించారు.