టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 10) రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. దాదాపుగా 450 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. అయితే శంకర్ సినిమాలోని పాటలకి కచ్చితంగా ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంతో సినిమాలోని పాటలకి మాత్రమే రూ.75 కోట్లు ఖర్చు చేశారు.
అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు గేమ్ ఛేంజర్ బాక్సాఫిస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ డే దాదాపుగా రూ.175 నుంచి రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సేస్ కలుపుకుని అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఇందులో తెలుగు స్టేట్స్ లో మార్నింగ్ షోలకి టికెట్స్ హౌజ్ ఫుల్ అయినట్లు సమాచారం. సంక్రాంతి సెలవులు ఉండటం, టికెట్ రేట్లు పెరగటం వంటివి ఉండటంతో గేమ్ ఛేంజర్ భారీ కలెక్షన్లకి స్కోప్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 (రూ.294, గ్రాస్) టాప్ లో ఉంది. మరి గేమ్ ఛేంజర్ పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.
ALSO READ | AnuEmmanuel: హార్రర్ థ్రిల్లర్తో వస్తోన్న అను ఇమ్మాన్యుయేల్.. ఆసక్తిగా 'బూమరాంగ్' ఫస్ట్ లుక్ పోస్టర్
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల విషయానికొస్తే ఇండియాతో పాటు ఓవర్సీస్ కలుపుకుని బిజినెస్ రూ.200-230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇండియా వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.175-185 కోట్ల వరకు జరిపిందని టాక్ వినిపిస్తోంది. దీంతో దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.150 కోట్ల రూపాయల షేర్, రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకూ మేకర్స్ మాత్రం ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటపెట్టలేదు.