గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer).తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Adwani) హీరోయిన్ గా నటిస్తున్నారు.దాదాపు సంవత్సరంన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..గేమ్ ఛేంజర్ చివరి షూటింగ్ షెడ్యూల్ నేడు(ఏప్రిల్ 22న) షురూ అయింది.ఈ షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ గా వారం రోజుల పాటు జరిగేలా షూటింగ్ ప్లాన్ చేశారు శంకర్.ఈ చివరి షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌తో పాటు వర్సటైల్ తమిళ యాక్టర్ ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ లేటెస్ట్ షెడ్యూల్‌తో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తవుతుంది.అయితే, ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్గా ఈ మూవీ నుండి వచ్చిన జరగండి సాంగ్ ఫ్యాన్స్ ఉహించుకున్నంత రేంజ్లో లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూ వచ్చింది. మరో రాబోయే సాంగ్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.
గేమ్ ఛేంజర్ సినిమాని..ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.