రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఓ షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ చరణ్‌పై యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరించారు. మార్చి రెండో వారంలో తదుపరి షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ కొత్త కబురు వినిపిస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారట.
క్రిస్మస్ సెలవుతో పాటు బుధవారం విడుదలవుతుండటం వల్ల లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇంతకుముందు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా డిసెంబర్‌లో రాబోతోంది.
ఇప్పటికే డెబ్భై శాతం వరకూ చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.