Game Changer: బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?

Game Changer: బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా లీకుల పర్వం ఊపందుకుంది. ఈ సినిమా ఫలితం, వసూళ్ల మాట పక్కనుంచితే, లీకులే నిర్మాతకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

గేమ్ ఛేంజర్ రిలీజైన (జనవరి 10) మొదటి రోజే HD ప్రింట్తో లీకై మేకర్స్కు షాక్ ఇచ్చింది. బస్సులలో, లోకల్ టీవీలలో స్ట్రీమింగ్ చేస్తూ తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ కు మరో భారీ షాక్ తగిలింది. గేమ్ ఛేంజర్ అల్ట్రా హెచ్‌డి 5.1 ఆడియో వెర్షన్ లీక్ తో వైరల్ అవుతుంది. ఆడియో ఆన్‌లైన్‌లో లీక్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Also Read :- దోమకొండ కోటలో ప్రియాంక చోప్రా

అయితే, ఇపుడు వైరల్ అయిన వీడియో థియేటర్ ప్రింట్ కాదని, సినిమా ఎడిటింగ్ టేబుల్ నుంచే వచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వీడియోలో CG వర్క్ కనిపించట్లేదని.. అంటే, టీమ్ నుంచే లీక్ కావొచ్చని తెలుస్తోంది. మరి ఇలాంటి లీకుల పైత్యం ఎందుకు చేస్తారో, వచ్చిన సినిమా అవకాశం ఎందుకు కోల్పోయేలా చేసుకుంటారో అని కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో ఒక సాధారణ సమస్య:

తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా పైరసీతో పోరాడుతోంది, అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు రిలీజ్ మొదటి నుంచే HD లీక్ అవ్వడం నిర్మాతను బాగా నష్టపరిచింది. సాధారణంగా, ఏ సినిమా అయినా OTT విడుదల సమయంలో HD వెర్షన్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. కానీ, ఈ సినిమాకు మాత్రం లీక్ చాలా త్వరగా జరిగింది. ఇది వసూళ్లకు భారీగా నష్టాన్ని మిగిల్చడంతో పాటు ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. 

ఏదేమైనా కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇలా పైరసీ భూతంతో కాలిపోవడం ప్రమాదం. అయితే,ఈ లీకుల విషయంపై నిర్మాతలు, సైబర్ టీమ్ ఎంత ప్రయత్నించిన తరుచూ కంటిన్యూ అవుతుండటం.. భవిష్యత్తు సినిమాలకు ప్రమాదంగా నిలిచే అవకాశముంది.

గేమ్ ఛేంజర్ సినిమా రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే మరో రూ.222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.152 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది.