GameChanger: అధికారిక ప్రకటన వచ్చేసింది.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్

GameChanger: అధికారిక ప్రకటన వచ్చేసింది.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో అవుతోంది. కానీ, ఒక విషయంలో మాత్రం మెగా చాలా డిజప్పాయింట్ లో ఉన్నారు. ఎందుకంటే.. గేమ్ ఛేంజర్ సినిమాపై మొదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. 

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ సందర్బంగా గేమ్‌ ఛేంజర్‌ ను రానున్న డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని ట్వీట్ చేసాడు తమన్ .అలాగే సెప్టెంబర్ 25న గేమ్‌ ఛేంజర్‌ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరినట్టైంది.

అయితే, గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు..ఒకటి రెండు పోస్టర్స్‌, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో..గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. దీంతో మేకర్స్ అప్డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోరు పెంచేశారు. 

Also Read :- దేవర మూవీకి టికెట్ల పెంపు

ముందుగా ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఆ తరువాత సమ్మర్ అన్నారు.. అది కాస్త సెప్టెంబర్ కి మారింది. అయినప్పటికి.. మెగా ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలయ్యారు. కానీ, మరోసారి గేమ్ ఛేంజర్ విడుదల మరింత ఆలస్యం కానుందని..డిసెంబర్ కు పోస్ట్ పోనే చేయనున్నారని..వార్తలు వినిపించడంతో..మాకో స్పెషల్ డేట్ కావాలంటూ సోషల్ మీడియాను షేక్ చేశారు.