గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..

గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..

టాలీవుడ్ స్టార్ హెవెరో గ్లోబల స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో  చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్స్ చేసందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ మధ్య గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, కానీ సెకెండాఫ్ మాత్రం సూపర్ గా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ సెకెండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయని అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మొత్తం సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే ఈ రివ్యూలు ఎక్కువగా తమిళ్ వర్గాల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. 

ALSO READ : Baby John Day 2 Collections: రిస్క్ చేసిన బాలీవుడ్ హీరో.. పుష్ప 2 దెబ్బకి 50% డ్రాప్ అయిన కలెక్షన్స్..

ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. దీంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమాని దాదాపుగా 12500 స్క్రీన్స్ లో ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2.o, ఐ, భారతీయడు 2 సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఇందులో రోబో 2, ఐ సినిమాలు కలెక్షన్స్ బాగానే రాబట్టాయి, కానీ భారతీయడు 2 మాత్రం భారీ నష్టాలని మిగిల్చింది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.