![అక్షయ్ కుమార్ సాంగ్‌కు రామ్ చరణ్ స్టెప్పులు](https://static.v6velugu.com/uploads/2023/02/khiladi-song-from-selfiee_TVvo0mJcgE.jpg)
ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిన రామ్ చరణ్‌కు బాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న చరణ్.. బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యతో కలిసి అక్షయ్ కుమార్ నటించిన సినిమాలోని ఓ సాంగ్‌కు స్టెప్పులేశారు. "మై ఖిలాడీ తూ అనారి" సినిమాలోని టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి రామ్ చరణ్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు తన సొంత బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.