మెగా అభిమానులకు సల్లూభాయ్ సర్‌ప్రైజ్.. ఊర మాస్ లుక్కులో రాంచరణ్ ఎంట్రీ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియెన్స్ కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.  కిసీకా భాయ్ కిసీకీ జాన్ అనే తన సినిమాలో ఇప్పటికే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పాట పెట్టి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో నుంచి ఎంటమ్మా..  అనే సాంగ్ ను రిలీజ్ చేశాడు. వెంకీతో పాటుగా సల్లూభాయ్ ఈ పాటలో పంచె కట్టులో స్టెప్పులేస్తూ ఇరగదీశారు. ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పాటతో మూవీ టీం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. పంచె కట్టు, కూలింగ్ గ్లాసెస్ తో మాస్ లుక్ లో రాంచరణ్ ఈ పాటలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ, సల్మాన్ తో కలిసి క్రేజీ స్టెప్పులు వేశాడు.

తెలుగు, హిందీలో లిరిక్స్ ని కలిపి కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి మంచి బేస్ ఉన్న మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే తెలుగులో రీమేక్ అయిన పవన్ కళ్యాన్ కాటమరాయుడుని సల్మాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో వెంకీ కీలక పాత్రలో మెరవనుండగా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో బాలీవుడ్ లోనూ సౌత్ సినిమాల మేనియా కొనసాగుతోంది. ఇప్పుడు రెండు భాషల్లోని స్టార్లతో సల్మాన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి. 

https://youtu.be/xb59o_op8Z0