హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్ చరణ్ సందడి చేశారు. లేటెస్ట్ గా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చారు. రామ్ చరణ్ రాకతో ఆర్టీఏ ఆఫీసు దగ్గర సందడిగా మారింది. రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు,అధికారులు ఎగబడ్డారు. అధికారులు రామ్ చరణ్ తో ఫోటోలు దిగారు. రాంచరణ్ వెహికల్ రోల్స్ రాయ్స్ కారు నెంబర్ టీజీ 09 C 2727 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేసన్ పూర్తయ్యాక రామ్ చరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ALSO READ | Jagapathi Babu: ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతి బాబు సంచలన ట్వీట్
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ చిత్రానికి ప్రముఖ విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ స్టార్ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది .