రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇటీవల జరిగిన పదిహేను రోజుల షెడ్యూల్‌లో క్లైమాక్స్‌కు సంబంధించిన భారీ ఫైట్ సీన్స్ తీశారు.
తాజాగా కొత్త షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఈ షూట్ జరగబోతోంది. జూన్ ఫస్ట్ వీక్‌లో షూట్ స్టార్ట్ చేసి, జూన్ 12 వరకూ ఈ షెడ్యూల్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, సముద్రఖనితోపాటు పలువురు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీయబోతున్నారు.
దీని తర్వాత తమిళనాడులో కూడా ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె.సూర్య, జయరామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ తీస్తున్న శంకర్.. రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు.