హీరో గ్లామర్ 2024 ను లాంచ్​ చేసిన రామ్​చరణ్

సరికొత్త కలర్ ట్రిమ్ తో రూపొందించిన హీరో గ్లామర్ 2024 బైక్​ను నటుడు రామ్ చరణ్ హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో లాంచ్​ చేశారు.  స్పోర్టీ ఫెయిరింగ్, ఎల్​ఈడీ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని హీరో తెలిపింది. 

దీనికి 12 5సీసీ  సింగిల్- సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమర్చారు. డిజిటల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రమెంట్ క్లస్టర్, యూఎన్​బీ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  హీరో గ్లామర్ 2024 డ్రమ్ వేరియంట్ ధర రూ. 83,598 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 87,598 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది.