Peddi Audio Rights: భారీ ధరకు పెద్ది మూవీ ఆడియో హక్కులు.. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్

Peddi Audio Rights: భారీ ధరకు పెద్ది మూవీ ఆడియో హక్కులు.. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్

మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిల్మ్స్ లో రామ్ చరణ్ RC16 ఒకటి. ఇటీవలే రామ్ చరణ్ ఫస్ట్ లుక్తో పాటు పెద్ది టైటిల్ను ప్రకటించారు మేకర్స్.  దానికి తోడు శ్రీరామనవమి పండుగ (ఏప్రిల్ 6) సందర్భంగా.. పెద్ది సినిమా గ్లింప్స్ వీడియో రానుందని తెలిపారు. ఈ క్రేజీ అప్డేట్స్తో పెద్ది సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. 

లేటెస్ట్గా మెగా ఫ్యాన్స్కు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్న పెద్ది సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు రూ.25కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ను తీసుకుంది. ఇది రామ్ చరణ్ కెరియర్లోనే అత్యధికం.

Also Read:-ఓటీటీలోకి సూపర్ హిట్ ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గత సినిమా గేమ్ ఛేంజర్ ఆడియో రైట్స్ సుమారు రూ.23కోట్లకి అమ్ముడయ్యాయి. ఇప్పుడు పెద్ది మూవీ రూ.25కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి బలమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాక్. రంగస్థలం రేంజ్‍లో రస్టిక్‍గా ఈ చిత్రంలో చరణ్ కనిపించనున్నారు. 

ఇటీవలే రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను తెలియజేస్తున్నాయి. అందులో ఒక పోస్టర్లో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు.

మ‌రో పోస్ట‌ర్‌లో జాత‌ర సెట్‌, విలేజ్ నేటివిటీ, చేతిలో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకొని సీరియ‌స్‌ లుక్‌లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ మెగా అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 6న వచ్చే పెద్ది గ్లింప్స్ తో మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.