Game Changer Premiers: పుష్ప బావ ఎఫెక్ట్ : సీక్రెట్ గా గేమ్ ఛేంజర్ మూవీ చూసే ప్లాన్ చేసుకున్న చెర్రీ

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా అంజలి, కియారా అద్వానీ నటించగా ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఈసారి థియేటర్ కి వెళ్లకుండా కేవలం తన స్నేహితులు, సన్నిహితులతో కలసి అర్థరాత్రి సమయంలో ప్రయివేట్ థియేటర్లో చూసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ | GameChanger: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆమధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో ఫ్యాన్స్ భారీగా రావడంతో సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఒక మహిళ మృతి చెందగా శ్రీతేజ అనే బాలుడు ఇప్పటికీ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా గేమ్ ఛేంజర్ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తెరకెక్కించారు. దీంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు..