Ram Charan: ఫ్యాన్స్ ఇది మీకోసమే.. రంగస్థలం ఎఫెక్ట్ మళ్ళీ రిపీట్ కానుందా!

Ram Charan: ఫ్యాన్స్ ఇది మీకోసమే.. రంగస్థలం ఎఫెక్ట్ మళ్ళీ రిపీట్ కానుందా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) వరుస క్రేజీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభమయింది ఈ మూవీ. రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేశారట మేకర్స్. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా అద్భుతమైన సెట్ వేయించారట మేకర్స్. సినిమా షూటింగ్ దాదాపు ఇదే సెట్ లో జరుగనుందని సమాచారం. గతం లో రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం కోసం కూడా ఇలాంటి భారీ పల్లెటూరి సెట్ వేశారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి RC 16 కోసం అలాంటి సెట్ వేయిస్తున్నారు. దాంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2025 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.