RC16 Shooting Update: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. RC16 లో జగపతిబాబు, కానంద స్టార్ హీరో శివరాజ్ కుమార్, మిర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ దివ్యేందు తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా ప్రముఖ సంగీత డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. క్రికెట్ ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే కర్ణాటకలోని మైసూరులో షూటింగ్ ప్రారంభం కాగా ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం RC16 టీమ్ హైదరాబద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా హైదరాబాద్ ల్నివు బంజారాహిల్స్ లో ఉన్న బూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్ బ్యాక్ డ్రాప్ లోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ షెడ్యూల్ కి రామ్ చరణ్ తోపాటూ జాన్వీ కపూర్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే 25% శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న RC16 సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
ALSO READ | అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్... ఫాస్ట్ గా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమాగా పుష్ప2..
ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రముఖ విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా భాషలలో వచ్చే ఏడాది జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దాదాపుగా రూ.300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. దీంతో ఈ ప్రమోషన్స్ తర్వాత RC16 షూటింగ్ లో పాల్గనబోతున్నట్లు సమాచారం.