రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా.. స్టోరీ కూడా మారిందా.?

రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా..  స్టోరీ కూడా మారిందా.?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కి జోడీగా దేవర మూవీ ఫేమ్ జాన్వీ కపూర్ నటిస్తుండగా జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్  దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, వెటరన్ హీరోయిన్ రమ్యకృష్ణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది చివరిలో కర్ణాటకలోని మైసూరులో మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇండోర్ గేమ్ షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమా టైటిల్, స్టోరీ విషయంలో రోజుకో వార్త సర్కులేట్ అవుతోంది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం RC16కి "పవర్ క్రికెట్" అనే  టైటిల్ పరిశీలిస్తున్న సమాచారం. అలాగే గతంలో ఈ సినిమా కర్నూలుకి చెందిన కబడ్డీ ప్లేయర్ బయోపిక్ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ క్రికెట్ ఆట స్టోరీ అంటూ పలు వార్తలు బలంగా వైరల్ అవుతోంది. దీంతో RC16 టైటిల్, స్టోరీపై సస్పెన్స్ నెలకొంది. అలాగే త్వరలోనే ఈ సినిమా టైటిల్ అప్డేట్ ఇవ్వాలని మేకర్స్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ గతంలో నటించిన ఆరెంజ్ సినిమాలో క్రికెటర్ గా ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించాడు. అలాగే సినీ క్రికెట్ లీగ్ లో కూడా బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.

ALSO READ | Vidaamuyarchi day 2 collection: అజిత్ సినిమాకి టికెట్లు తెగడం లేదా.. రెండో రోజు భారీగా డ్రాప్ అయిన కలెక్షన్స్..

ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ తో సంక్రాంతి బరిలో దిగాడు. కానీ ఈ సినిమా ఆశించిన సుతఃయిలో ఆడియన్స్ ని ఆలరించలేకపోయింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ రామ్ చరణ్ మాత్రం బుచ్చిబాబు సినిమాతో ఫ్యాన్స్ కి ఫుల్ ప్యాక్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.