సాయి ధరమ్ తేజ్, ‘కలర్స్’ స్వాతి జంటగా నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీని నుంచి సోల్ ఆఫ్ సత్య అనే పాటను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో తేజ్ మాట్లాడుతూ ‘మన కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్న సైనికులకు, వారి వెనుకున్న ఎందరో తల్లులు, భార్యలు, అక్కచెల్లెళ్లకు మేము ఇస్తున్న ట్రిబ్యూట్ ‘సోల్ ఆఫ్ సత్య’.
మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ షార్ట్ ఫీచర్ ఫిల్మ్ అందరికీ రీచ్ కావాలి’ అన్నాడు. ‘ఓ అమ్మాయి జీవితంలో ఎన్నో కలలుంటాయి. అలాంటి కలలు ఉండే అమ్మాయికి మిలటరీ వ్యక్తి భర్తగా దొరికితే ఎలా ఉంటుందనేది ఈ సబ్జెక్ట్’ అని దిల్ రాజు అన్నారు, నవీన్ కృష్ణ. నిర్మాతలు హర్షిత్, హన్షిత, మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని పాల్గొన్నారు.