Game Changer: గేమ్ ఛేంజర్ బిగ్ అప్డేట్.. హై వోల్టేజ్‌కి సిద్ధంగా ఉన్నారా?

Game Changer: గేమ్ ఛేంజర్ బిగ్ అప్డేట్..  హై వోల్టేజ్‌కి సిద్ధంగా ఉన్నారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.

లేటెస్ట్గా గేమ్ ఛేంజర్ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి నాలుగో పాట (Dhop Song) ప్రోమోని ఇవాళ సాయంత్రం 6.03 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ అయ్యాయి. యూట్యూబ్ ని షేక్ చేసాయి. ఇప్పుడు ఈ హై ఓల్టేజ్ సాంగ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫుల్ సాంగ్ డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. మరి ఈ దోప్ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చరణ్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

జనవరి 10న రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో రిలీజ్ చేశారు. అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడువుతున్నాయి. రిలీజయ్యే టైంకి ఇదే ఊపు కొనసాగితే ఇప్పటివరకు ఉన్న సినిమాలా రికార్డ్స్ అన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ఫాన్స్ భావిస్తున్నారు.