Game Changer OTT: అఫీషియల్.. గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్‌పై ప్రైమ్ వీడియో అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Game Changer OTT: అఫీషియల్.. గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్‌పై ప్రైమ్ వీడియో అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సవాళ్లను ఎదుర్కొంది. అద్భుతమైన ఓపెనింగ్ ఉన్నప్పటికీ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గడంతో డిజాస్టర్ మూవీస్ లిస్టులో చేరింది. దాంతో ఈ సినిమా నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రానుంది.

గేమ్ ఛేంజర్ ఓటీటీ:  

లేటెస్ట్గా గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇస్తూ X లో పోస్ట్ చేసింది. 'గేమ్ ఛేంజర్' ఫిబ్రవరి 7, 2025న ప్రీమియర్ కానుందని తెలిపింది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్కి వస్తుందని ప్రైమ్ వీడియో వెల్లడించింది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది.

 'గేమ్ ఛేంజర్' మూవీ 23 రోజుల్లో దాదాపు రూ.130.74 కోట్లు నెట్ వసూలు చేసింది. అయితే, బాక్సాఫీస్ వసూళ్లు క్రమంగా తగ్గుతోంది. ఈ చిత్రం 23వ రోజున కేవలం రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజున రూ.51 కోట్ల కలెక్షన్లతో బలంగా స్టార్ట్ అయినప్పటికీ.. ఇక తరువాతి వారాల్లో ఆ ఊపును కొనసాగించడంలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది.