Ram Charan: RC 16 షూటింగ్ అప్డేట్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Ram Charan: RC 16 షూటింగ్ అప్డేట్.. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ను  ఢిల్లీలో మొదలుపెట్టేలా ప్లాన్ చేశారట మేకర్స్. ఈ షెడ్యూల్‌లో  రెజ్లింగ్‌తో  కూడిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, టీజర్ ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.