తేజ్..ఒక ఫైటర్‌‌‌‌‌‌‌‌లా తన టెన్ ఇయర్స్ జర్నీని పూర్తి చేశాడు : రామ్ చరణ్

తేజ్..ఒక ఫైటర్‌‌‌‌‌‌‌‌లా తన  టెన్ ఇయర్స్ జర్నీని పూర్తి చేశాడు : రామ్ చరణ్

తేజ్..ఒక ఫైటర్‌‌‌‌‌‌‌‌లా తన  టెన్ ఇయర్స్ జర్నీని పూర్తి చేశాడని రామ్ చరణ్ అన్నాడు. సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ టైటిల్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో గెస్ట్‌‌‌‌గా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘తేజ్‌‌‌‌ది బ్యూటిఫుల్ జర్నీ. తను ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. క్యారెక్టర్ కోసం తపన పడుతుంటాడు. ఇది తనకి 18వ సినిమా. ఇందులో తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో చూస్తారు. డైరెక్టర్ రోహిత్ కేపీతో సహా టీమ్‌‌‌‌ అందరికీ ఆల్ ద బెస్ట్‌‌‌‌’ అని చెప్పాడు. ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన తన ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటానని  సాయి దుర్గ తేజ్ అన్నాడు.

ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని  హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి,  చిత్ర దర్శకుడు రోహిత్, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య అన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వ ప్రసాద్, ఎస్‌‌‌‌కేఎన్, దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి, ప్రశాంత్ వర్మ, వైవీఎస్ చౌదరి, దేవ కట్టా, కిశోర్ తిరుమల ఈ కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. అజనీష్ లోక్‌‌‌‌నాథ్​ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.