గౌతమ్ డైరెక్షన్ లో చెర్రీ

గౌతమ్ డైరెక్షన్ లో చెర్రీ

రాజమౌళి, శంకర్‌‌‌‌లతో సినిమా అంటే కచ్చితంగా ఆ హీరోల గత చిత్రాల స్థాయిని మించి ఆ మూవీ ఉంటుంది. ఎన్టీఆర్, చరణ్‌‌లతో రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’.. అలాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీనే. ఇది కంప్లీట్ కాగానే శంకర్ సినిమా షూటింగ్‌‌లో జాయినయ్యాడు చరణ్. ఇదీ ప్యాన్ ఇండియా మూవీనే. అయితే శంకర్ సినిమా పూర్తవకముందే ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్‌‌ తిన్ననూరితో కూడా సినిమాని అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు దీన్ని తెలుగు సినిమా అనే అనుకున్నారంతా. కానీ ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీయేనట. ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఉంటుందని చెప్పాడు గౌతమ్. ‘జెర్సీ’ మూవీ హిందీ రీమేక్ ప్రమోషన్స్‌‌ సందర్భంగా మాటల మధ్యలో గౌతమ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అని చెప్పాడు. అంటే శంకర్ మూవీ తర్వాత ఓ భారీ యాక్షన్ మూవీలో నటించబోతున్నాడు రామ్ చరణ్. మళ్లీ రావా, జెర్సీ సినిమాల్లో ఎమోషనల్‌‌ కంటెంట్‌‌తో మెప్పించిన గౌతమ్.. చరణ్‌‌తో ఎలాంటి సినిమా తీస్తాడోననే ఆసక్తి నెలకొంది. శంకర్ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.