రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఐఎఎస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో వచ్చే పొలిటీషియన్ పాత్ర. ఈ రెండు పాత్రలకు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి.
అయితే.. అంతకుమించి అన్నట్టుగా ఇందులో మొత్తం ఏడు గెటప్స్‌లో చరణ్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఈ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. నిజానికి శంకర్ సినిమాల్లో హీరోలు ఇలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ఒకవేళ కథలో గెటప్స్‌కు అవకాశం లేకపోయినా తను ఎంతో లావిష్‌గా తీసే పాటల్లో అయినా హీరోలతో వెరైటీ గెటప్స్ వేయిస్తుంటాడు శంకర్.
మరి ‘గేమ్ చేంజర్’లో కథలో భాగంగా చరణ్‌ను ఏడు గెటప్స్‌లో చూపిస్తున్నారా లేక పాటల్లో మాత్రమే అలా చూపబోతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఇప్పటికే క్లైమాక్స్ సీన్స్‌కు సంబంధించిన షూట్ కంప్లీట్ చేశారు. జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథను అందించాడు.