Unstoppable with NBK: అన్‌స్టాపబుల్‌ రామ్‌చ‌ర‌ణ్ పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే ’(UnstoppableWithNBK) షోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌చ‌ర‌ణ్ సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది ఆహా. దీనికి మెగా పవర్ ఎపిసోడ్ అంటూ టైటిల్ ఫిక్స్ చేసింది.

"మొదటి ఎపిసోడ్ తో వినోదం పెద్దదైంది, ఆశ్చర్యాలు రెట్టింపు అయ్యాయి. 200% హామీతో కూడిన వినోదాన్ని కొనసాగిస్తూ మెగా పవర్ ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 17న ప్రీమియర్ అవుతుంది" అంటూ వీడియో రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ కి అసలైన పండుగ మొదలైందనే చెప్పొచ్చు. 'ఓ వైపు థియేటర్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ హంగామా.. మరో వైపు ఓటీటీలో మెగా పవర్ ఎపిసోడ్ తుఫాన్'.. ఇక చెప్పేదేం ఉంది. రచ్చ రచ్చే. 

అయితే తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ చరణ్ చేసిన ఆ మూమెంట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి విషయంపై కూడా చరణ్ స్పందించినట్లు టాక్. ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన యువతి అని అన్ స్టాపబుల్ లో రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. చూడాలి మరి!