మెగా అభిమానులకు హీరో రామ్ చరణ్ ఊహించని షాకిచ్చాడు. తమ అభిమాన హీరోకు వారుసుడే పుడుతాడంటూ సంబరపడుతోన్న అభిమానులకు తమకు పుట్టబోయేది అమ్మాయే అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్ "నా మొదటి జాన్ ఉపాసన. నా రెండవ జాన్ నా పెంపుడు కుక్క రైమ్. నా మూడోవ జాన్ ఉపాసన గర్భంలో ఉంది” అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టబోయేది ఆడపిల్లే అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇక ఇటీవల గ్రాండ్ గా జరిగిన ఉపాసన సీమంతం వేడుకల్లో పింక్ కలర్ హైలెట్ అయింది. ఉపాసన కూడా పింక్ కలర్ డ్రస్ లో కనిపించింది.. పింక్ కలర్ అమ్మాయిలకు సంకేతం. దీంతో రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది అమ్మాయినే అన్న చర్చ ఇటు ఇండస్ట్రీలోనూ, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇంకొందరు మెగా ఫ్యామిలీలో మొదటి సంతానంగా అమ్మాయినే పుట్టింది కాబట్టి చరణ్ విషయంలోనూ అదే జరగబోతుందంటూ చర్చిస్తున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులకు ముందుగా సుస్మిత పుట్టింది. రెండో కూతురుగా శ్రీజ జన్మించింది. సుస్మిత, శ్రీజలకు సైతం మెదటి సంతానంగా ఆడపిల్లలే జన్మించారు. దీంతో వారసత్వం పరంగా చూసుకున్నా రామ్ చరణ్ కు మొదటి సంతానంగా అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉందంటున్నారు.