మెగా పవర్ స్టార్ ఐనా, గ్లోబల్ స్టార్ ఐనా భార్యకి భర్తే కాదా. రామ్ చరణ్(Ram Charan) కూడా అంతే. తాజాగా ఆయన తన భార్య ఉపాసన(Upasana) కాళ్ళు నొక్కుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఎంత స్టార్ అయినా ఓ భార్యకి భర్తే కాదా. రామ్ చరణ్ బెస్ట్ హస్బెండ్, భయ్యా నువ్వు గ్రేట్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి సంబరాల్లో భాగంగా ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం హాజరవుతున్నారు. ఈ వేడుకలకు రామ్ చరణ్, ఉపాసనకు కూడా ఇన్విటేషన్ అందింది. దీంతో స్పెషల్ ఫ్లైట్ లో జాంనగర్ బయల్దేరారు రామ్ చరణ్ ఉపాసన. ప్రయాణం మద్యంలో ఉపాసన చిన్న కునుకు తీయగా.. రామ్ చరణ్ ఆమె కాళ్ళు నొక్కుతూ కనిపించారు. ఆ సన్నివేశాన్ని పక్కనవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.
🥹❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/dmGBnk7V5Q
— Raees (@RaeesHere_) March 1, 2024
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
also read : Varsha, Emmanuel: ఇమ్మూతో పెళ్లి.. వర్ష ఏంటి అలా అనేసింది?