Ram Charan, Upsana: గొప్ప మనసు చాటుకున్న చరణ్, ఉపాసన.. 500 మంది డ్యాన్సర్స్కి ఆరోగ్య బీమా

Ram Charan, Upsana: గొప్ప మనసు చాటుకున్న చరణ్, ఉపాసన.. 500 మంది డ్యాన్సర్స్కి ఆరోగ్య బీమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న దాదాపు 500మందికి పైగా డాన్సర్స్ కి ఆరోగ్య బీమా అందించనున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంధర్బంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jani Master (@alwaysjani)

సరైన సమయంలో సహాయం చేసేవాడే దేవుడు. నా పుట్టిన రోజున రాంచరణ్ అన్నయ్య నన్ను ఇంటికి పిలిచారు. అందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. గతంలో నేను రామ్ చరణ్ అన్నయ్యని అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మా డ్యాన్సర్ యూనియన్‌ లోని 500 కుటుంబాలకు ఆరోగ్య భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. మా యూనియన్ సభ్యులకు అండగా నిలిచినందుకు రాంచరణ్ అన్నయ్య, ఉపాసన వదినకు మా ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.