మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ : భర్తకు మద్దతుగా ఉపాసన పోస్ట్

మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ : భర్తకు మద్దతుగా ఉపాసన పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉన్నారనే విషయం తెలిసిందే. దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ (కవి సమ్మేళనం) ఈవెంట్‌కు నవంబర్ 18న ముఖ్యఅతిథిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు.

అయితే, రామ్ చరణ్ కడప దర్గాను అయ్యప్పమాలలో ఉండి సందర్శించుకోవడంతో పలు హిందూ సంఘాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్గా అంటే ఓ సమాధి.. సమాధిని సందర్శించి వస్తే మాల తీసేయాలి కదా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజన్ రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) ను ట్యాగ్ చేస్తూ.. "మేడమ్ ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలోని వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా మరియు మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించుకోగలుగుతాం" అంటూ ట్వీట్ చేసింది. 

ఈ నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. "విశ్వాసం ఏకం చేస్తుంది, అది ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము.. మన బలం ఐక్యతలోనే ఉంది. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు.. వన్ నేషన్ వన్ స్పిరిట్.. జైహింద్" అంటూ చరణ్ దర్గాలో ఉన్న ఫోటో షేర్ చేసింది. దాంతో మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ అంటూ ఒక్క పోస్ట్తో విమర్శలు చేస్తోన్న నెటిజన్స్కు క్లారిటీ ఇచ్చింది.

ALSO READ : OTT రిలీజ్‌కు ముందే రెండు క్రైమ్ సిరీస్‌లు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్ట్రీమింగ్: వాటి స్టోరీ లైన్స్ ఇవే!

ఇకపోతే క‌డప అమీన్ పీర్ పెద్ద ద‌ర్గా ఉరుసు ఉత్సవాలకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్‌కు.. అటెండ్ అవుతానని రామ్‌చ‌ర‌ణ్ మాటిచ్చార‌ట‌. రెహ‌మాన్‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డే చ‌ర‌ణ్ క‌డ‌ప ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాల్లో పాల్గొన‌నున్న‌ట్లు సమాచారం.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న RC 16 లో నటిస్తున్నాడు.  ఈ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ నెల 22న మైసూర్‌లో జ‌రుగ‌నున్న ఫ‌స్ట్ షెడ్యూల్‌లో చరణ్, హీరోయిన్ జాన్వీకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ 2025 సంక్రాంతికి రీలిజ్ కానుంది.