Ram Charan: మెగా ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్.. అప్పన్నగా రామ్ చరణ్

Ram Charan: మెగా ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్.. అప్పన్నగా రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. 

అంతే కాదు.. ఈ సినిమాలో రామ్ చరణ్ చేయబోయే పాత్ర గురించి కూడా ఆడియన్స్ లో ఆసక్తినెలకొంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో తండ్రి పాత్ర చాలా కీలకం కానుందట. అవును.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందట. అంతేకాదు.. ఈ పాత్ర గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అదేంటంటే.. ఈ సినిమాలో తండ్రిగా రామ్ చరణ్ అప్పన్న అనే పాత్రలో కనిపిస్తాడట. గ్రామీణ ప్రాంతాల్లో పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్ గా కనిపంచే ఈ పాత్రలో రామ్ చరణ్ కు  నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలెట్ కానుందని సమాచారం. ఈ పాత్రలో రామ్ చరణ్ నటన, హావభావాలు చాలా బాగుంటాయట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రంగస్థలం సినిమాలో చెవిటివాడిలా కనిపించి మెప్పించిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమాలో నత్తి సమస్యతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.