ఆర్ఆర్ఆర్(RRR) భారీ సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ సినిమాలో చరణ్ నటనకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తరువాతి సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇండియన్ బడా మేకర్స్ అందరు ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, రామ్ చరణ్ మాత్రం సెలెక్టెడ్ గానే సినిమా చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పక్కా శంకర్ స్టైల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఒక సినిమా, రంగస్థలం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. రామ్ చరణ్ త్వరలోనే బాలీవుడ్ సినిమా చేయనున్నాడట. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న ఓ భారీ పీరియాడిక్ డ్రామా కోసం రామ్ చరణ్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్.
ప్రముఖ రచయిత అమిష్ రాసిన ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ సినిమాలో రామ్ చరణ్ సుహల్ దేవ్ గా కనిపించబోతున్నాడని సమాచారం. 11వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్ అవధ్ ప్రాంతానికి చెందిన సుహల్ దేవ్ శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. రాజపుత్ర వంశానికి చెందిన సహేల్ దేవ్ బర్హాజ్.. 1034 CEలో జరిగిన బహ్రైచ్ యుద్ధం గజ్నవిద్ దళాలపై విజయం సాధించాడు. ఆతరువాత ఘజ్నావిడ్ చొరబాటుదారులను కూడా అడ్డుకున్నాడు సహల్ దేవ్. అలా భారతదేశానికి చెందిన గొప్ప రాజుల్లో ఒకరిగా నిలిచారు సహల్ దేవ్. అలాంటి వీరుడి కథతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే ఇప్పటినుండే అంచనాలు క్రియేట్ అవుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.