ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం(Vyooham). దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, వైఎస్ జగన్(YS Jagan) పాదయాత్ర, ఆయన ఎలా సీఎం అయ్యారు అనే వాస్తవిక సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరక్కిస్తున్నారు దర్శకుడు వర్మ. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగానికి వ్యూహం అని, రెండవ భాగానికి శపథం(Shapadham) అని టైటిల్స్ పెట్టారు వర్మ.
— Ram Gopal Varma (@RGVzoomin) October 11, 2023
Also Read :- తాగి ఓవరాక్షన్ చేసిన ప్యాసింజర్
అనౌన్స్మెంట్ తోనే సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనియ్యాంశంగా మారాయి. ఇక తాజాగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటిచ్చారు ఆర్జీవీ. మొదటి భాగంగా వస్తున్న వ్యూహం సినిమా నవంబర్ 10న, రెండవ భాగంగా వస్తున్న శపథం జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు రెండు కొత్త పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి టీజర్ తోనే సంచలనం రేపిన ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.