కొత్త సినిమా అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

కొత్త  సినిమా అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

ఇకపై ‘సత్య’ లాంటి గొప్ప చిత్రాలే తెరకెక్కిస్తానంటూ ఇటీవల ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ.. బుధవారం తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘అత్యంత భయానక జంతువు కేవలం మనిషి మాత్రమే.  ‘సత్య’ ఫిల్మ్ కన్సెషన్ నోట్‌‌కు కొనసాగింపుగా నేను ఇప్పటివరకూ తీయనంత అతి పెద్ద చిత్రాన్ని తీయాలనుకుంటున్నా. 

ఈ సినిమా పేరు ‘సిండికేట్‌‌’.  భారతదేశం ఉనికిని  ప్రశ్నార్థకం చేయాలని చూసే ఓ సంస్థపై తీస్తున్న సినిమా ఇది’ అంటూ మూవీ టైటిల్‌‌ను ప్రకటించారు. ‘గత పదేళ్లలో చెప్పుకోదగ్గ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఏదీ రాలేదు. కానీ ఇప్పుడు ప్రజల మధ్య ఏర్పడిన విభజన రేఖలు ఓ కొత్త సంస్థకు ఊపిరి పోస్తున్నాయి. పోలీస్ ఏజెన్సీలు,  రాజకీయ పార్టీలు,  బిజినెస్‌‌ మ్యాన్‌‌లు, మిలిటరీతో ఏర్పడే సిండికేట్ కనుక ఇది భయానకంగా ఉండబోతోంది’ అంటూ కాన్సెప్ట్‌‌ రివీల్ చేశారు.  గత కొన్ని సంవత్సరాలుగా తాను చేసిన సినిమా పాపాలన్నింటినీ ఈ చిత్రంతో కడిగివేస్తానంటూ వర్మ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.